వరూధిని ఏకాదశి ఎప్పుడు? ఆ రోజున ఎవరిని ఆరాధిస్తారు?

హిందూ సంప్రదాయంలో ఏకాదశి అనేది చాలా పవిత్రమైన తిథి. ప్రతి నెలా రెండు ఏకాదశులు వస్తాయన్న విషయం తెలిసిందే. శుక్ల పక్షంలో ఓ ఏకాదశి, కృష్ణ పక్షంలో మరో ఏకాదశి వస్తుంది. ఏకాదశి అంటేనే అత్యంత పవిత్రమైన రోజు. అలాంటి ఏకాదశుల్లో కొన్నింటికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వాటిల్లో ఒకటి ‘వరూథిని ఏకాదశి’. ఇది ఏటా చైత్ర మాసంలోని కృష్ణ పక్షంలో వస్తుంది. ఈ ఏడాది ఎప్పుడు వస్తుందంటే.. ఏప్రిల్ 24న గురువారం “వరూథిని ఏకాదశి” వచ్చింది. ఈ పవిత్రమైన రోజు విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన వామనావతారాన్ని ఆరాధిస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని నమ్మకం.

అంతేకాకుండా వరూధిని ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం ఆచరించడం, ఉపవాసం ఉండడం, దానధర్మాలు చేయడం వల్ల గొప్ప ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. అసలు వరూధిని ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తే ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకుందాం. వరూధిని ఏకాదశి నాడు కొన్ని విధివిధానాలు పాటించాలట. అలా చేస్తే అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. వరుధిని ఏకాదశి నాడు చేసే ఏకాదశి వ్రతంతో పది వేల ఏళ్ల పాటు తపస్సు చేసినంత ప్రయోజనం లభిస్తుందని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.

Share this post with your friends