హరిద్వార్‌లో మహా కుంభమేళా ఎప్పుడంటే..

మహా కుంభమేళాకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక, మతపరమైన పండుగ. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనున్న విషయం తెలిసిందే. ప్రతి మహా కుంభమేళా మహా శివరాత్రి రోజున ముగుస్తుంది. మరి హరిద్వార్‌లో మహా కుంభమేళా ఎప్పుడు? హరిద్వార్‌లోనూ ప్రతి 12 ఏళ్లకోసారి మహా కుంభమేళా జరుగుతుంది. ఇక్కడ కుంభమేళాను కుంభరాశిలో బృహస్పతి.. అదే సమయంలో మేషరాశిలో సూర్యుడు సంచరిస్తున్న సమయంలో నిర్వహిస్తారు. గతంలో కుంభమేళాను 2021లో హరిద్వార్‌లో మహా కుంభ మేళాను నిర్వహించారు.

మళ్ళీ 2033లో హరిద్వార్‌లో మహాకుంభను నిర్వహించనున్నారు. అలాగే మహాకుంభ స్నానం చేయడం వల్ల సర్వ పాపాలు, రోగాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. మహా కుంభమేళాను నాలుగు ప్రదేశాల్లో నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ముందుగా ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా నిర్వహించనున్నారు. అనంతరం హరిద్వార్‌లో కుంభమేళా జరగనుంది. ఆ తరువాత ఉజ్జయిని, నాసిక్‌లలో జరగనుంది. అసలు కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకున్నాం కదా.. సాగర మథనం సమయంలో అమృత బిందువులు ఒలికి భూమిపై నాలుగు ప్రదేశాల్లో పడ్డాయట. ఆ నాలుగు ప్రదేశాల్లో మహా కుంభమేళా నిర్వహించడం జరుగుతోంది.

Share this post with your friends