ఈ ఏడాది మాఘ పౌర్ణమి ఎప్పుడు?

హిందూ సంప్రదాయంలో కార్తీక మాసం, శ్రావణ మాసాలకు ఉన్నంత ప్రత్యేకత మాఘమాసానికి ఉంటుంది. అందుకే ఈ మాసంలో వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. కార్తీక మాసంలో దీపాలు, దీపారాధనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. అలాగే మాఘమాసంలో పవిత్ర స్నానాలకు ప్రాధాన్యత ఇస్తాం. అందునా మాఘమాసంలో వచ్చే మాఘ పూర్ణిమకు అత్యంత విశిష్టత ఉంటుంది. ఈ మాఘ పౌర్ణమిని మహా మాఘి అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చిందనేది ముందుగా తెలుసుకుందాం.

ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. ‘మా’ అంటే మహాలక్షీ. ‘ధనుడు’ అంటే భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. మొత్తంగా ఈ మాసం లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైనదని చెబుతారు. ఈ ఏడాది మాఘ పూర్ణిమ తిథి ఫిబ్రవరి 11న సాయంత్రం 6:55 గంటలకు ప్రారంభమవుతుంది. తిరిగి 12 ఫిబ్రవరి బుధవారం సాయంత్రం 7:22 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం మనం ఏ పండుగనైనా జరుపుకుంటాం కాబట్టి మాఘ పూర్ణిమను ఫిబ్రవరి 12న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.

Share this post with your friends