ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఎప్పుడు?

ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం త్వరలోనే ఏర్పడనుంది. అది ఎప్పుడో కాదు.. హోలీ పండుగ రోజే. ఈ చంద్రగ్రహణం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల నడుమ ఏర్పడనుంది? దీని ప్రభావం భారతదేశంపై ఎంత ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. 2025లో తొలి చంద్రగ్రహణం మార్చి14న హోలీ పండుగ రోజే ఏర్పడనుంది. ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం భారత కాలమానం ప్రకారం 14న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల 56 నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 3:29 వరకు ఈ గ్రహణం ఉంటుంది.

అయితే చాలా మందిలో హోలీ పండుగ రోజే చంద్రగ్రహణం ఏర్పడుతుండటంతో పండుగ జరుపుకోవాలా? వ జరుపుకోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే భారత దేశంపై ఈ చంద్రగ్రహణ ప్రభావం ఉండదు కాబట్టి పండుగను నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. గ్రహణం పగటి సమయంలో ఏర్పడుతుండటంతో, దీని ప్రభావం భారతదేశంపై ఏమాత్రం ఉండదంటున్నారు. ఈ చంద్రగ్రహణం, ఉత్తర అమెరికా, పశ్చిమ ఆఫ్రికాలో కనిపిస్తుందట. భారతదేశంపై ఏమాత్రం గ్రహణ ప్రభావం ఉండదు కాబట్టి మార్చి 13న హోలికా దహనం, మార్చి 14న హోలీ పండుగను జరుపుకోవచ్చని సూచిస్తున్నారు.

Share this post with your friends