హిందూ మతంలో ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ రోజున చేసే పూజలు, ఉఫవాసాలు వలన విష్ణువు, లక్ష్మీదేవి సంతోషించి తద్వారా ప్రత్యేక ఆశీస్సులు అందజేస్తారని విశ్వాసం. ప్రతి నెలా రెండుసార్లు ఏకాదశి తిధి వస్తుంది. కాబట్టి చాలా మంది ఈ రెండు రోజులు ఉపవాసం ఉంటారు. మాసంలో వచ్చే ఏకాదశి రెండూ వచ్చేసి ఒకటి శుక్ల పక్షంలో కాగా.. మరొకటి కృష్ణ పక్షంలో రానుంది. ఈ లెక్కన సాధారణంగా సంవత్సరంలో 24 ఏకాదశిలు ఉంటాయి. అయితే కొన్నిసార్లు అధిక మాసం వస్తుంది. అప్పుడు ఏడాదిలో ఏకాదశుల సంఖ్య 26 అవుతుంది.
తెలుగు సంవత్సరం ప్రకారం.. ఈ ఏడాదిలో చివరి ఏకాదశి మరికొద్ది రోజుల్లో ఏకాదశి రానుంది. దీనిని పాపమోచని ఏకాదశి అని పిలుస్తారు. ప్రస్తుతం ఫాల్గుణ మాసం నడుస్తోంది. దక్షిణ భారతదేశంలో హిందూ క్యాలెండర్‌ను అమావాస్య నుంచి అమావాస్యకు మధ్య ఉన్న సమయాన్ని మాసంగా పరిగనిస్తారు. దక్షిణ, ఉత్తర భారత దేశాల్లో దీనిని వేర్వేరుగా జరుపుకుంటారు. ఈ నెలలో పామోచని ఏకాదశి ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షంలో వస్తుంది. ఉత్తర భారత క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని కృష్ణ పక్షంలో జరుపుకుంటారు. పాల్గుణ మాసం కృష్ణ పక్ష ఏకాదశి తిథి మార్చి 25న ఉదయం 5:05 గంటలకు ప్రారంభమై 26న తెల్లవారుజామున 3:45 గంటలకు ముగుస్తుంది. కాబట్టి మనం పాపమోచని ఏకాదశిని మార్చి 25 జరుపుకోనున్నాం.