మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్టి ఎప్పుడు?

హిందూమతంలో ప్రతి దేవుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ క్రమంలోనే శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి సైతం ప్రత్యేకత ఉంది. స్వామివారిని పూజిస్తే మన ఆటంకాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కాబట్టి ప్రతి మాసంలోనూ వచ్చే సుబ్రహ్మణ్య షష్టికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్టి నాడు సుబ్రహ్మణ్యుడి జన్మదినం జరుపుకుంటారు. కాబట్టి ఇది మరింత ప్రత్యేకం. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే రాహు కేతు దోషాలు, కాలసర్ప దోషాలతో పాటు కుజ దోషాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. మరి సుబ్రహ్మణ్య షష్టి ఈ మాసంలో ఎప్పుడు రానుంది అనేది తెలుసుకుందాం.

ఈ ఏడాది మార్గశిర మాసంలో షష్ఠి తిథి డిసెంబర్ 6 శుక్రవారం మధ్యాహ్నం 12:07 గంటలకు మొదలై మరుసటి రోజు డిసెంబర్ 7 మధ్యాహ్నం 11:05 గంటల వరకూ కొనసాగనుంది. మనం ఏ పండుగనైనా ఉదయ తిథి ప్రకారం జరుపుకుంటాం కాబట్టి డిసెంబర్ 7న సుబ్రహ్మణ్య షష్టిని మనం జరుపుకోనున్నాం. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మనం స్వామివారికి అభిషేకం చేస్తే బాగా కలిసొస్తుందని చెబుతారు. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం లేదా కరావలంబ స్తోత్రం లేదా భుజంగ స్తోత్రం.. ఈ మూడింటిలో ఒకటి చదవడం కానీ వినడం కానీ చేస్తే సంపూర్ణంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి దోషాలన్నీ తొలగిపోతాయట.

Share this post with your friends