శ్రావణ మంగళగౌరీ వ్రతాన్ని ఎప్పుడు చేసుకుంటారంటే..

హిందూ మతంలో ప్రతి నెలకూ ఓ విశిష్టత ఉంటుంది. అయితే శ్రావణ మాసానికి మరింత ఎక్కువ విశిష్టత ఉంటుంది. ఈ నెలలో వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, ఇతర పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో శుభకార్యాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వివాహాలు మొదలు గృహ ప్రవేశాలు వంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక ఈ శ్రావణమాసంలో ఉత్తరాదివారు శివుడిని పూజిస్తారు. శ్రావణ మాసంలో శుక్రవారంతో పాటు మంగళవారానికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. మంగళవారం నాడు పార్వతీదేవిని పూజిస్తారు. అలాగే మంగళ గౌరీ వ్రతాన్ని సైతం ఆచరిస్తారు.

సోమవారం నాడు శివుడికి.. మంగళవారం నాడు ఆయన భార్య గౌరీదేవిని కొలుస్తారు. మరి మంగళ గౌరీ వ్రతం ఎప్పుడు ఆచరిస్తారు అంటే శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం జరుపుకుంటూనే ఉంటారు. ఎవరి వీలును బట్టి వారు ఏదో ఒక మంగళవారాన్ని ఎంచుకుని చేసుకుంటారు. శ్రావణమాసం ప్రారంభమైన తదుపరి రోజు అంటే ఆగస్ట్ 6 మంగళవారం మంగళ గౌరి వ్రతం ఆచరిస్తారు. ఇక ఆ తరువాత ఆగస్ట్ 13, ఆగస్ట్ 20, ఆగస్ట్ 27 తేదీల్లోనూ వీలును బట్టి జరుపుకుంటారు. ఈ రోజున పార్వతీ మాతను పూజిస్తారు. వివాహిత మహిళలైతే సౌభాగ్యం కోసం.. పెళ్లికాని యువతులైతే మంచి వరుడు లభించాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

Share this post with your friends