సంకటహర చతుర్థి ఎప్పుడు?

సంకటహర చతుర్థికి హిందూ మతంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ సంకటహర చతుర్థి నాడు గణేశుడిని మనం పూజిస్తూ ఉంటాం. సంకటహర చతుర్థిని ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిధిని సంకటహర చతుర్థిగా జరుపుకుంటాం. ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకున్నా, పూజ చేసుకున్నా మనం ముందుగా వినాయకుడినే పూజించుకుంటాం. కాబట్టి సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని పూజించడం వలన ఫలితం మరింత ఎక్కువగా ఉంటుందని నమ్మకం. ఇవాళ వినాయకుడిని పూజిస్తే అన్ని రకాల కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుందట. అలాగే వ్యాపారంలో విజయం సాధిస్తారని నమ్మకం.

సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని పూజిస్తే ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుందట. మరి ఈ సంకటహర చతుర్థి మార్గశిర మాసంలో ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం మార్గశిర మాసం కృష్ణ పక్ష చతుర్థి తిథి డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10.06 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే డిసెంబర్ 19వ తేదీ ఉదయం 10.02 గంటలకు ముగుస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మనం అఖూర్త సంకటహర చతుర్థి ని డిసెంబర్ 18 న జరుపుకుంటాం. అన్ని పండుగలను మనం ఉదయ తిథి ప్రకారం జరుపుకుంటాం. కానీ సంకటహర చతుర్థి రోజున గణపతిని సాయంత్రం పూజిస్తాం కాబట్టి 18న జరుపుకుంటాం. దీని తర్వాత ఉపవాసం విరమిస్తారు.

Share this post with your friends