శ్రావణ మాస సంకట హర చతుర్థి ఎప్పుడు? పూజా సమయం ఏంటి?

హిందూ మతంలో ప్రతి ఒక తిథికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. శ్రావణ మాసంలో చాలా పండుగలతో పాటు శుభకార్యాలు, మంచి తిథులు రానున్నాయి. వాటితో సంకట హర చతుర్ధి ఒకటి. దీనికి శ్రావణ మాసంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఈ రోజున మనం గణేశుడిని పూజించుకుంటాం. ఈ రోజున గణేషుడిని పూజిస్తే జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి ఆనందం, సమృద్ధి, శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం. అంతే కాకుండా కెరీర్‌ పరమైన అడ్డంకులు కూడా తొలగిపోయి ప్రశాంత జీవనం అలవడుతుంది. మరి సంకష్ట చతుర్థి ఎప్పుడు అంటారా?

పంచాంగ ప్రకారం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి అయితే ఇవాళ రాత్రికే ప్రారంభమవుతుంది. అంటే ఆగస్టు 7వ తేదీ రాత్రి 10.05 గంటలకు ప్రారంభమై ఆగస్టు 8వ తేదీ అర్ధరాత్రి 12.36 గంటలకు ముగుస్తుంది. కాబట్టి మనం సంకట హర చతుర్థిని 8వ తేదీన జరుపుకుంటాం. ఇక పూజకు సరైన సమయం ఎప్పుడో తెలుసుకుందాం. వినాయక చతుర్థి రోజున పూజకు 2 గంటల 40 నిమిషాల శుభ ముహూర్తం ఉంది. అది ఎప్పుడు ప్రారంభమై.. ఎప్పుడు ముగుస్తుందంటే.. వినాయక చతుర్థి రోజున ఉదయం 11:07 నుంచి మధ్యాహ్నం 1:46 వరకూ ఉంటుంది. ఈ సమయంలో మనం గణేశుడిని పూజించుకుంటాం.

Share this post with your friends