నిర్జల ఏకాదశి ఎప్పుడు?

హిందూ మతంలో ఏకాదశికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇక నిర్జల ఏకాదశికైతే మరింత ప్రాధాన్యత. అన్ని ఏకాదశిలలో అత్యుత్తమమైనదిగా పరిగణిస్తారు. దీనిని జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి రోజును నిర్జల ఏకాదశిగా పిలుస్తారు. ఏకాదశి అంటేనే విష్ణువుకు అంకితమైన రోజు. నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఉపవాసం ఉన్న వ్యక్తి తన పాపాల నుంచి విముక్తితో పాటు శ్రీ హరి ఆశీస్సులు పొందుతాడట. మరి అంతటి పవిత్రమైన నిర్జల ఏకాదశి ఎప్పుడు రానుందో తెలుసుకుందాం.

వేద క్యాలెండర్ ప్రకారం నిర్జల ఏకాదశి అంటే జ్యేష్ఠ మాసంలోని ఏకాదశి తిథి జూన్ 6న నిర్వహించుకోనున్నాం. నిర్జల ఏకాదశి తిథి జూన్ 6న తెల్లవారుజామున 2:15 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు జూన్ 7న ఉదయం 4:47 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం మనం పండుగలను జరుపుకుంటాం కాబట్టి నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ 6న జరుపుకోనున్నాం. ఈ రోజున విష్ణుమూర్తికి ఇష్టమైన తులసితో చేసే కొన్ని పరిహారాల కారణంగా ఎన్నో విధాలుగా మంచి జరుగుతుందట. సంపద వృద్దితో పాటు.. మంచి ఆరోగ్యం, కుటుంబంలో ఆనందం వంటివి దక్కుతాయి.

Share this post with your friends