ఈ ఏడాది నరక చతుర్థశి ఎప్పుడు?

గొప్పగా నిర్వహించుకునే హిందూ పండుగల్లో నరక చతుర్దశి కూడా ఒకటి. ఈ పండుగను మనం ప్రతి ఏడాది ఆశ్వయుజమాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఈ నరక చతుర్దశికి చాలా పేర్లు ఉన్నాయి. కాళీ చతుర్దశి అని.. ఛోటీ దీపావళి అని కూడా నరక చతుర్దశిని పిలుచుకుంటూ ఉంటాం. ఈ రోజున మనం మృత్యుదేవత అయిన యమ ధర్మరాజును పూజిస్తాం. అంతేకాకుండా దీపావళి నాడు ఇంట్లో యమ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం.

దీపావళి నాడు దక్షిణ ధిశలో కానీ.. ఇతర ప్రాంతాల్లో కానీ యముడి పేరుతో యమ దీపం వెలిగిస్తూ ఉంటాం. కాబట్టి దీనిని ఛోటీ దీపావళి అని కూడా పిలుస్తారు. అసలు నరక చతుర్దశి ఎప్పుడో తెలుసుకుందాం. ప్రతి ఏడాది నరక చతుర్దశిని కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు జరుపుకుంటూ ఉంటాం. ఈ ఏడాది ఈ తిథి ఎప్పుడంటే.. అక్టోబరు 30 ఉదయం 01:15 గంటలకు ప్రారంభమై మర్నాడు అక్టోబర్ 31న మధ్యాహ్నం 03:52 గంటలకు ముగుస్తుంది. ఈ ప్రకారం చూస్తే మనం ఈ ఏడాది నరక చతుర్దశిని 31 అక్టోబర్ 2024న జరుపుకుంటాం.

Share this post with your friends