కామిక ఏకాదశి ఎప్పుడు? ఆ రోజున ఎవరిని పూజించాలి?

ఆషాఢ మాసంలో కొన్ని ముఖ్యమైన తిథులు వస్తుంటాయి. వాటిలో కామిక ఏకాదశి ఒకటి. ఏకాదశి గురించి అయితే మనందరికీ తెలుసు. కానీ కామిక ఏకాదశి గురించే కొంతమందికి తెలిసి ఉండదు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని కామిక ఏకాదశి రోజున కొలుచుకుంటాం. ఈ రోజున ఉపవాసముంటే చాలా మంచిదట. కామిక ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తానే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని శుచిగా స్నానమాచరించి లక్ష్మీనారాయణుడిని పూజించాలి. అలాగే ఉపవాస దీక్షను సైతం చేపడుతారు.

కామిక ఏకాదశి వత్రం చేస్తే మన పాపాలన్నీ నశించడంతో మనం కోరుకున్న కోరిక ఏదైనా నెరవేరుతుందట. కాబట్టి ఈ రోజున వ్రతమాచరిస్తే మంచిదట. పురాణ గ్రంథాలలో కామిక ఏకాదశి వ్రత మహిమ గురించి ఉంది. ఇక ఈ కామిక ఏకాదశి ఎప్పుడంటారా? ముందే చెప్పుకున్నాం.. ఆషాడ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి నాడని.. ఆ లెక్కన ఈ నెల 31న కామిక ఏకాదశి వస్తుంది. ఇక దీని ప్రభావం రోజంతా ఉంటుందట. కాబట్టి ఉపవాసం ఆచరించదలుచుకున్నవారు ఆగస్ట్ 1న ఉపవాసం విరమించాల్సి ఉంటుంది. ఇక ఆగస్ట్ 1న విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తే మంచిది.

Share this post with your friends