హనుమంతుడి జయంతి ఎప్పుడు? ఆ రోజున ఏ సమయానికి పూజకు అనుకూలం?

గత ఏడాది నుంచి పండుగల విషయంలో కొంత గందరగోళం చోటు చేసుకుంది. హనుమంతుడి జయంతి విషయంలోనూ అదే గందరగోళం చోటు చేసుకుంది. నిజానికి చైత్ర మాసంలోని శుక్ల పౌర్ణమి రోజున హనుమంతుడు జన్మించారు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం కూడా హనుమంతుడి జయంతిని జరుపుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ఏడాది హనుమంతుడి జయంతి విషయంలో కొంత గందరగోళం ఉండటంతో ఏ రోజున నిర్వహించుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. 23న నిర్వహించాలా? లేదంటే 24న నిర్వహించాలా? అని కొంత సందిగ్ధం చోటు చేసుకుంది.

పంచాంగం ప్రకారం చైత్ర మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి ఏప్రిల్ 23వ తేదీన తెల్లవారుజామున 3:25 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 24 ఉదయం 5:18 గంటలకు ముగుస్తుంది. కాబట్టి హనుమంతుడి జయంతిని 23నే నిర్వహించుకోనున్నారు. ఇక ఆ రోజున ఏ సమయంలో స్వామివారికి పూజ చేస్తే సత్ఫలితం ఉంటుందో చూద్దాం. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 9.03 గంటల నుంచి 10.41 గంటల వరకు హనుమంతుని పూజించడానికి అనుకూలమైన సమయం. అయితే ఈ రోజున ఉదయం 4:20 నుండి 05:04 వరకూ బ్రహ్మ ముహూర్తం ఉంది కాబట్టిఈ శుభ సమయంలో స్నానం చేస్తే శుభకరంగా ఉంటుంది.

Share this post with your friends