గురు పౌర్ణిమ ఎప్పుడు? ఉపవాసం ఎప్పుడు ఆచరించాలి?

గురు పౌర్ణమి పండుగను ఎప్పుడు జరుపుకుంటామో తెలుసా? ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటూ ఉంటాము. ఈ లెక్కన ఈ తిథి ఈ ఏడాది జూలై 20న ప్రారంభమవుతుంది. కానీ మనం జూలై 21న గురు పౌర్ణమి పండుగను జరుపుకుంటాం. ఎందుకంటే.. ఈ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి తిథి రెండు రోజులు అంటే మిగులు తగులుగా వచ్చింది. అసలు ఆషాఢ పౌర్ణమి తిథి ఏ రోజున ముగియనుంది? ఆషాఢ పూర్ణిమ స్నాన దానం, ఉపవాసం ఏ రోజున ఆచరించాలి? శుభ సమయం ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిది జూలై 20న సాయంత్రం 5:59 గంటలకు ప్రారంభమై.. జూలై 21న మధ్యాహ్నం 03:46 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ తిథిని పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి 21నే గురుపౌర్ణమి జరుపుకుంటాం. ఆ రోజున బ్రహ్మ ముహూర్తంలో వీలు పడని వారు తరువాతైనా శుచిగా స్నానం చేసి చంద్రుడికి సంబంధించిన వస్తువులను సామర్థ్యం మేర దానం చేయాల్సి ఉంటుంది. గురు పూర్ణిమ రోజు శుభ సమయం లేదా అభిజీత్ ముహూర్తం మధ్యాహ్నం 12:00 నుంచి 12:55 వరకు ఉంటుంది. ఇక అమృత సమయం వచ్చేసి మధ్యాహ్నం 02:44 నుంచి 03:39 వరకూ ఉంటుంది. ఉపవాసం మాత్రం 20నే ఆచరించాలి.

Share this post with your friends