దీపావళి ఎప్పుడు? అక్టోబర్ 31, నవంబర్ 1.. కన్ఫ్యూజన్ ఎందుకు?

హిందువుల అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి కూడా ఒకటి. ఇది విజయానికి గుర్తుగా మనం జరుపుకునే పండుగ. ప్రతి ఇల్లు దీపాలతో అందంగా వెలిగిపోతూ ఉంటుంది. అలాగే దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించుకుంటాం. అయితే అసలు ఈ దీపావళి ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంటుంది. మరి ఈ దీపావళి అక్టోబర్‌ 31నా? నవంబర్‌ 1నా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీపావళి రోజున లక్ష్మీదేవి భూమిపైకి వస్తుంది నమ్మకం కాబట్టి కచ్చితమైన తేదీని తెలుసుకుంటే మంచిది.

ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా మనం జరుపుకుంటాం. ప్రదోష అమావాస్య రోజున అక్టోబర్‌ 31న.. నవంబర్‌ 1న.. ఈ రెండు తేదీలలో వస్తుంది. అంతేకాకుండా నవంబర్‌ 1న ఆయుష్మాన్ యోగం.. స్వాతి నక్షత్రం కలయిక జరగనుంది కాబట్టి నవంబర్‌ 1న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే దీపావళి నాడు అమావాస్య తిథి, ప్రదోష కాలాల్లో.. సూర్యాస్తమయం నుంచి అర్థరాత్రి వరకు జరుగుతుంది కాబట్టి అక్టోబర్ 31న జరుపుకోవాలని కొందరు పండితులు చెబుతున్నారు. దీనిపై ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు.

Share this post with your friends