దేవశయన ఏకాదిశి ఎప్పుడు? దీని ప్రత్యేకతేంటి?

హిందువులు ఏకాదశి తిథికి ఎంత ప్రాధాన్యమిస్తారో తెలియనిది కాదు. ప్రతి నెలలోనూ ఏకాదశి వస్తూనే ఉంటుంది. కృష్ణ , శుక్ల పక్ష ఏకాదశి తిథులను విష్ణుమూర్తికి అంకితం. ఏకాదశి రోజున చాలా మంది ఏకాదశి వ్రతం ఆచరిస్తూ ఉపవాసం ఉంటారు. ఇలా చేస్తే గత జన్మ పాపాలు నశిస్తాయని నమ్మకం. ఆషాఢ మాసంలో దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి వస్తుంది. ఈ రోజున ఉపవాసం చేస్తే చాలా మంచిదట. ఈ తొలి ఏకాశిని దేవశయని ఏకాదశి, పద్మనాభ ఏకాదశి, హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢమాసంలోని ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే.. ఈ రోజునే శ్రీ హరి యోగనిద్రకు వెళ్లి.. కార్తీకమాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్మకం.

మరీ ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి నుంచి హిందువుల పండగలు ప్రారంభం అవుతాయట. ఇక శ్రీహరి యోగనిద్రకు వెళ్లే నాలుగు నెలల సమయంలోనే చాతుర్మాస దీక్ష నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఎలాంటి శుభ కార్యాలనూ నిర్వహించరు. కొందరైతే కేవలం భగవత్ ఆరాధనలోనే ఉంటారు. మరి దేవశయన ఏకాదశి ఈ ఏడాది ఎప్పుడు వస్తుంది అంటారా? హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిథి జూలై 16 వ తేదీ మంగళవారం రాత్రి 8:33 గంటలకు ప్రారంభమవుతుంది. తిరిగి తదుపరి రోజు అంటే జూలై 17వ తేదీ బుధవారం రాత్రి 09:02 గంటలకు ముగుస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై 17న మనం జరుపుకుంటూ ఉంటాం.

Share this post with your friends