బల్కంపేట్ ఎల్లమ్మ జాతర ఎప్పుడంటే..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయ జాతరకు సంబంధించిన తేదీలను నిర్వాహకులు ఇవాళ ప్రకటించారు. ఈ నెల 8 నుంచి 10 వరకూ బల్కంపేట ఆలయంలో జాతర జరగనుంది. జూలై 9న అమ్మవారి కల్యాణం నిర్వహించనున్నారు. జూలై 10న రథోత్సవం నిర్వహించనున్నారు. పిలిస్తే పలికే దైవంగా భక్తులు అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఇక ఎల్లమ్మ తల్లి కల్యాణం మహాదేవ శివయ్యతో జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలను అందిస్తూ ఉంటుంది. ఈ ఉత్సవాల్లో పసుపును విరివిగా వినియోగిస్తూ ఉంటారు.

ఎల్లమ్మ దేవిని.. రేణుకా దేవి, జలదుర్గా దేవిగా భక్తులు పిలుస్తూ ఉంటారు.జలదుర్గాదేవి అనడానికి కారణమేంటంటే.. అమ్మవారి శిరసుభాగం వెనుక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీటిని స్నానం చేసే నీటిలో కొంచెం కలుపుకుంటే ఎలాంటి చర్మ సంబంధిత సమస్య అయినా ఇట్టే పోతుందట. ఇల్లు తుడిచే నీటిలో కలుపుకుంటే ఇంట్లో ఎలాంటి నెగిటివిటీ ఉన్నా పోతుందని అంటారు. ఇక అమ్మవారి కల్యాణం చూసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయట. ఇక ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను.. ముఖ్యంగా చీర, గాజులు సౌందర్య ఉత్పత్తులను భక్తులు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు.

Share this post with your friends