అమలక ఏకాదశి ఎప్పుడు? ఆ రోజున ఎవరిని పూజించాలి?

ఏకాదశి తిథి రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజించుకుంటాం. వైకుంఠ మాసంలోని శుక్ల, కృష్ణ పక్షాలలో వచ్చే ఏకాదశి తిథి రోజున ఏకాదశిని జరుపుకుంటాం. అయితే ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అమలక ఏకాదశి లేదా ధాత్రి ఏకాదశి లేదా అమృత ఏకాదశి అని కూడా అంటారు. ముందుగా అమలక ఏకాదశి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. ఈసారి అమలక ఏకాదశి ఉపవాసం మార్చి 10, 2025న నిర్వహించుకుంటాం. అమలక ఏకాదశి రోజున శ్రీ హరితో పాటు ఉసిరి చెట్టును పూజించుకుంటాం.

ఇలా చేయడం వలన జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. అంతేకాకుండా పూజానంతరం విష్ణు చాలీసా పఠించాలి. అలా చేస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని చెబుతారు. అమలక ఏకాదశి ఉపవాసం చేయడం వలన అనేక తీర్థయాత్రలు, సహస్ర యజ్ఞాలకు సమానమైన పుణ్యం లభిస్తుందట. ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల పాపాలు నశించి మోక్షం లభించడంతో పాటు దుఃఖములను తొలగించి సుఖం, శ్రేయస్సు సమకూరుతుందట. ఈ ఉపవాసం జీవితంలో సానుకూల మార్పులను తెచ్చి అన్ని విధాలుగా ముందుకు వెళ్లడానికి చేసే యత్నాలన్నీ సఫలమవుతాయని పండితులు చెబుతారు.

Share this post with your friends