సోమప్రదోష ఈ నెలలో ఎప్పుడు వస్తుంది?

హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం శివారాధనకు ప్రదోష సమయం అత్యంత పవిత్రమైనది. ఆ రోజున శివుడిని పూజిస్తే చాలా మంచి జరుగుతుందట. శివారాధనకు దీనిని అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. సోమ ప్రదోష విశిష్టత ఏంటో తెలుసుకుందాం. సూర్యాస్తమయం తర్వాత ఉండే 2 గంటల 24 నిమిషాలు ప్రదోష కాలంగా పేర్కొంటారు. ప్రదోషం వచ్చే రోజు, తిథిని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి. ప్రతి రోజూ వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషం అనీ, త్రయోదశి రోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషం అని అంటారు. ప్రతి నెలా రెండు సార్లు ప్రదోషం వస్తుంది వీటిని శుక్ల పక్ష త్రయోదశి. కృష్ణ పక్ష త్రయోదశి అని పిలుస్తారు.

మరి ఈ నెలలో ఎప్పుడు ప్రదోష వ్రతం చేసుకోవాలి? జనవరి 27వ తేదీ పుష్య బహుళ త్రయోదశి , సోమవారం కలిసి వచ్చినందున ఆ రోజును సోమ ప్రదోషంగా జరుపుకుంటారు. సోమవారం, త్రయోదశి తిథితో కలిసి ఉంటే దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. త్రయోదశి తిథి నాడు ప్రదోష పూజను సాయంకాలం 5 గంటల నుంచి 7 గంటల లోపు చేసుకోవాలి. జనవరి 27 వ తేదీ సోమవారం సాయంత్రం 7:30 నిమిషాల వరకు త్రయోదశి తిధి ఉంది కాబట్టి ఆ రోజునే సోమ ప్రదోష వ్రతాన్ని ఆచరించాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.

Share this post with your friends