మహా కుంభమేళాలో రాజస్నానాలు ఎప్పుడెప్పుడంటే..

మహా కుంభమేళాలలోే తొలి రాజస్నానం గురించి తెలుసుకున్నాం కదా. అసలు కుంభమేళాలో మొత్తంగా ఎన్ని రాజస్నానాలుంటాయి? అవి ఎప్పుడు రానున్నాయో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహం 12 సంవత్సరాలలో 12 రాశుల చుట్టూ తిరుగుతుందట. ముఖ్యంగా నిర్దిష్ట రాశిలో గురుగ్రహం ఉన్నప్పుడు మహా కుంభమేళాను నిర్వహించడం జరుగుతుంది. ఈ కుంభమేళా సమయంలో స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అందునా రాజస్నానానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఆ రాజ స్నానాలు ఆరు ఉంటాయి. పుష్య పౌర్ణమి రోజున తొలి రాజస్నానం, మహా శివరాత్రి నాడు తుది రాజస్నానం ఉంటుంది. రాజస్నానాల తేదీలేంటో తెలుసుకుందాం.

తొలి రాజ స్నానం 13 జనవరి 2025న పుష్య పౌర్ణమి రోజున నిర్వహించనున్నారు.
రెండో రాజ స్నానం మకర సంక్రాంతి 14 జనవరి 2025 నాడు నిర్వహిస్తారు.
మూడో రాజ స్నానం 2025 జనవరి 29న మౌని అమావాస్య రోజున చేస్తారు.
నాలుగో రాజ స్నానం వసంత పంచమి, 3 ఫిబ్రవరి 2025 రోజున చేస్తారు.
ఐదో రాజ స్నానం మాఘ పూర్ణిమ, 12 ఫిబ్రవరి 2025 రోజున చేస్తారు.
చివరి రాజ స్నానం 2025 ఫిబ్రవరి 26 అంటే మహాశివరాత్రి నాడు నిర్వహిస్తారు.

Share this post with your friends