
దేవీ నవరాత్రులు అయినా.. వినాయక చవితి అయినా మరే ముఖ్య కార్యక్రమం అయినా మనం అఖండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. అఖండ దీపాన్ని ఆగ్నేయ మూలలో ఉంచాలి. ఆసక్తికరంగా అఖండ దీపం వత్తి వెలిగే దిక్కును బట్టి ఫలితం ఉంటుంది. అఖండ దీపం వత్తి తూర్పు వైపు వెలిగేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇలా తూర్పు వైపు వెలిగేలా చూస్తే మన ఇంట ఎలాంటి ఆటంకాలూ లేకుండా శుభకార్యాలు జరుగుతాయట. అలాగే పెద్దలకు తగిన గౌరవం లభిస్తుంది.
అఖండ దీపం ఉత్తరం వైపు వెలిగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. దన పరంగా కలిసివస్తాయట. అంతేకాకుండా ఆదాయ మార్గాలు పెరగడం తద్వారా అప్పులు తీరడం.. వృథా ఖర్చులు తగ్గిపోవడం, మొండి బకాయిలు వసూలు కావడం వంటివి జరుగుతాయట. ఇక అఖండ దీపం వెలిగించాక ప్రతి క్షణం గమనించుకుంటూ ఉండాలి. ఎన్ని రోజులు అఖండ దీపాన్ని ఉంచాలనుకుంటే అన్ని రోజుల పాటు కొండెక్కకుండా చూసుకోవాలి. నిత్యం నూనె సరిపడ ఉందా చూసుకుంటూ వత్తిని సైతం గమనించుకుంటూ ఉండాలి.
