గోవును అడిగిన శ్రీనివాసుడు అగస్త్యుడు పెట్టిన కండీషన్ ఏమిటి?

కలియుగ దైవం శ్రీనివాడిని ఏడుకొండలవాడని.. వేంకటరమణ అని.. మలయప్ప స్వామి అని.. వేంకటేశ్వర స్వామి అని.. ఇక ముఖ్యంగా గోవిందుడని పిలుస్తాం. ఆయన నామాలను సైతం గోవింద నామాలుగానే చెబుతాం. తిరుపతి నుంచి తిరుమలకు ప్రయాణం ఆరంభించింది మొదలు.. తిరిగి చేరుకునే వరకూ గోవిందా.. గోవిందా అంటూ ఆర్తిగా పిలుచుకుంటూనే ఉంటాం. శ్రీనివాసునికి గోవింద నామం అంటే చాలా ఇష్టమట. మరి ఆయనకెందుకు తన నామాల్లో గోవింద నామం అంటే అంత ఇష్టం? శ్రీనివాసుడు గోవిందుడు ఎలా అయ్యాడు? అంటే దీనికో పెద్ద కథే ఉంది.

శ్రీనివాసుడికి గోవిందుడనే నామం ఎలా వచ్చిందో తిరుమల మహత్యాన్ని వివరించే వేంకటాచల మహత్యం వివరించింది. శ్రీమన్నారాయణుడిపై అలిగిన శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠం వీడి భూలోకానికి వచ్చింది. ఆమెను వెదికేందుకు స్వామివారు కూడా భూలోకానికి వచ్చారు. నారాయణుడు భూమిపై అడుగిడగానే మానవులకు సహజమైన ఆకలిదప్పులు ఉన్నట్టుగానే ఆయనకు కూడా ఆ లక్షణాలు వచ్చేశాయట. వెంటనే అగస్త్యుని ఆశ్రమానికి వెళ్లి తనకు గోవు పాలు కావాలని.. తాను కలియుగాంతం వరకూ ఇక్కడే ఉంటానని.. కాబట్టి మీ ఆశ్రమంలోని ఒక గోవును ఇవ్వమని కోరాడు. స్వామివారే చూసిన మహర్షి.. తన ఆశ్రమానికి శ్రీనివాసుడే రావడం చాలా ఆనందంగా ఉందని… అయితే గోదానం చేయాలంటే మీ ధర్మపత్ని శ్రీ మహాలక్ష్మితో తన ఆశ్రమానికి రావాలంటూ కండీషన్ పెట్టాడు. మరి ఆ కండీషన్‌కు శ్రీనివాసుడు ఏం చేశాడు? అలిగిన అమ్మవారిని ఎలా అగస్త్యుని దగ్గరకు తీసుకొచ్చాడు? అనేది మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends