శారదీయ నవరాత్రులలో తొలి రోజున ఏం చేయాలి?

పవిత్రమైన శారదీయ నవరాత్రి పండుగ ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానుందన్న విషయం తెలిసిందే. ఈ నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 1 వరకూ కొనసాగనున్నాయి. ఈ పండుగ సమయంలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజించుకోవడం జరుగుతోంది. ఈ తొమ్మిది రోజులు భక్తులు ఉపవాసం ఉంటారు. అంతేకాకుండా నవదుర్గలకు పూజలు నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సమయంలో కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాల్సి ఉంటుంది. అసలు నవరాత్రులలో ఏం చేయాలి?

నవరాత్రులలో ముందుగా ఘటం లేదంటే కలశ స్థాపన, పూజ చేయాలి. నవరాత్రి మొదటి రోజున శుభ సమయంలో కలశాన్ని ప్రతిష్టించండి. కలశాన్ని ప్రతిష్టించడమంటే.. అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించడమేనని చెబుతారు. కలశ స్థాపన చేసినప్పటి నుంచి తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించాలి. నవరాత్రి సమయంలో ఇంటితో పాటు పూజ స్థలాన్ని పూర్తిగా శుభ్రంగా ఉంచుకుంటే ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది. నవరాత్రి ప్రారంభం రోజున కలశ స్థాపన అనంతరం చేయాల్సి పనేంటంటే.. అఖండ జ్యోతిని వెలిగించాలి. దీనిని తొమ్మిది రోజుల పాటు కొండెక్కకుండా చాలా జాగ్రత్తతగా చూసుకోవాలి. ఈ తొమ్మిది రోజుల పాటు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.

Share this post with your friends