మహాశివరాత్రి నాడు ఏం చేస్తే శని దోషం నుంచి విముక్తి లభిస్తుందంటే..

మహా శివరాత్రి వచ్చేస్తోంది. ఈ నెల 26న మహా శివరాత్రి రానుంది. ఇది పరమేశ్వరుడి భక్తులందరికీ అత్యంత ఇష్టమైన రోజు కావడమే కాదు.. జ్యోతిష్య ప్రకారమూ చాలా కీలకం. ఉచ్ఛ స్నథితిలో శుక్రుడు, మీన రాశిలో బుధుడు, వృషభరాశిలో పరివర్తన చెందిన గురువు, కుంభ రాశిలో రవి, శని రాశులు మహా శివరాత్రి నుంచి సంచారం చేయనును్నాయి. కాబట్టి ఆ రోజు నుంచి కొన్ని రాశుల వారికి మంచి జరుగనుంది. శనీశ్వరుడికి అధిష్ఠాన దేవత పరమేశ్వరుడు అయినందువల్ల ఆ రోజున శివుడికి అభిషేకం చేసినా, అర్చన చేసినా, శివాష్టకాన్ని పఠించినా, కనీసం శివాలయంలో ప్రదక్షిణలు చేసినా శనీశ్వరుడి దుష్ప్రభావం పూర్తిగా తగ్గిపోయి శని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. శివుడికి ప్రార్థన చేసినవారికి మహాశివరాత్రి నుంచి మొదలు మార్చి 29 వరకూ శుభ ఫలితాలే ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ఈ క్రమంలోనే కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశుల వారు ఆ రోజున శివుడిని పూజిస్తే వారికి చాలా బాగుంటుంది. మరి శివుడిని ఆయా రాశుల వారు ఎలా పూజించాలో చూద్దాం.

కర్కాటక రాశివారికి రెండున్నరేళ్లుగా అష్టమ శని పీడిస్తోంది కాబట్టి వారు రుద్రాష్టకం పఠించినా, శివుడికి అర్చన చేసినా శనిదోషం తొలగుతుంది.

సింహరాశి వారికి సప్తమ స్థానంలో శని ఉండటం వల్ల చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వారు శివరాత్రి రోనజున బిల్వపత్రాలతో శివుడిని పూజించాలి.

వృశ్చిక రాశివారికి నాలుగవ స్థానంలో శని ఉన్నందున గత రెండున్నర ఏళ్లుగా మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు శివరాత్రి నాడు శివుడికి అర్చన చేయాలి.

మకర రాశివారు గత ఏడున్నరేళ్లుగా అనుభవిస్తున్న ఏలిన నాటి శని బాధ నుంచి బయట పడాలంటే శివరాత్రి నాడు ఉపవాసంతో పాటు జాగరణ చేయాలి.

కుంభ రాశివారికి ఏలిన నాటి శని ప్రారంభమైనందున వారు శివరాత్రి నాడు శివార్చన చేయించడం వల్ల తప్పకుండా శని ప్రభావం చాలా వరకు తగ్గిపోయి అన్ని విధాలుగా ఉపశమనం లభిస్తుంది.

మీన రాశివారు ఏలిన నాటి శని దోషం వల్ల గత రెండున్నరేళ్లుగా ఆదాయానికి మించిన ఖర్చులతో పాటు ఇతర సమస్యలతో అవస్థలు పడుతున్ారు. వారు శివరాత్రి రోజున బిల్వ పత్రాలతో రుద్రాష్టకం చేయించడం వల్ల వీరికి ఏలిన నాటి శని దోషం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది.

Share this post with your friends