ధన త్రయోదశి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

దీపావళి పండుగను దేశమంతా ఘనంగా జరుపుకుంటూ ఉంటుంది. ఈ దీపావళి పండుగను చాలా ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ ఐదు రోజుల్లో ధన త్రయోదశి కూడా ఒకటి. అసలు దీపాల పండుగ ఈ ధనత్రయోదశితోనే ప్రారంభమవుతుంది. ప్రతి ఏటా దనత్రయోదశిని ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి రోజున జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజున ధన్వంతరిని ఆరాధించుకున్న వారి ఇంట ఎలాంటి ఆర్థిక కష్టాలు ఉండవట. అలాంటి ధన త్రయోదశి రోజున ఏం చేయాలో తెలుసుకుందాం.

ధన త్రయోదశి రోజున ఏమి చేయాలంటే..

ధన త్రయోదశి రోజున ధన్వంతరిని శుభ సమయంలో పూజించాలి. ఆ రోజున బంగారం, వెండి లేదా మట్టితో చేసిన లక్ష్మీ దేవి, గణేశుడి విగ్రహాలను తీసుకువచ్చి పూజించుకోవాలి. ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు దీపాలు వెలిగిస్తే మంచిదట. ఈ ధన త్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోలు చేయలేని వారు చీపురు, ధనియాలు, ఇత్తడి పాత్రలు కొనడం శుభప్రదంగా భావిస్తారు.

ధన త్రయోదశి రోజున ఏమి చేయకూడదు?

ధన త్రయోదశి రోజున ఇంటిని మురికిగా ఉంచవద్దు. మనసులో చెడు ఆలోచనలకు స్థానమివ్వవద్దు. ఎవరితోనూ తప్పుగా మాట్లాడటం కానీ అవమానించడం కానీ చేయకూడదు. ముఖ్యంగా ఇంటికి గాజు పాత్రలను తీసుకురావొద్దు. అలాగే మద్యం, మాంసారహారం వంటి వాటికి దూరంగా ఉండాలి.

Share this post with your friends