శుభకార్యాల్లో అడ్డంకులు ఎదురైతే ఏం చేయాలంటే..

ఇంట్లో ఏవో ఒక అవాంతరాల వలన శుభకార్యాలు జరగడం ఆలస్యమవుతూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా కూడా ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు శనివారం నాగు కొన్ని పరిహారాలు చేస్తే సరి. ఇంట్లో శుభకార్యాలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ పరిహారాలేంటి? ఏం చేస్తే అన్నీ సెట్ అవుతాయో తెలుసుకుందాం. ఇంట్లో వివాహాది శుభకార్యాలు మాత్రమే కాదు.. గృహ ప్రవేశాల వంటివి సైతం కొన్ని సందర్భాల్లో ఆలస్యమవుతూ ఉంటాయి.

శుభకార్యాల్లో అడ్డంకులు ఎదురైతే ఏం చేయాలంటే..
శుభకార్యాల్లో అడ్డంకులు ఎదురైతే ఏం చేయాలంటే..

అన్నీ అనుకున్నట్టు జరగాలంటే గ్రహాల అనుకూలతతో పాటు దైవానుగ్రహం కూడా ఉండాలని చెబుతారు. అవన్నీ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ప్రతికూల శక్తులు, దృష్టి దోషాలు, నరఘోష వంటివి శుభకార్యాలకు అడ్డంకిగా మారితే అలాంటి సందర్భంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆరాధించాలట. అది కూడా శనివారం నాడు ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుందట. వాస్తవానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనకు ఎలాంటి సమస్యనైనా తొలగించే శక్తి ఉంటుందని చెబుతారు. అందుకే లక్ష్మీ నరసింహ స్వామివారిని శనివారం పూజిస్తే ఎలాంటి అవాంతరమైనా సైడ్ అయిపోతుందట.

Share this post with your friends