సోమవతి అమావాస్యనాడు ఏం చేస్తే శ్రేయస్సు లభిస్తుంది?

హిందూమత విశ్వాసాల ప్రకారం దైవారాధనతో పాటు దానం చేయడం కూడా పవిత్రమైనదని అంటారు. అయితే వ్యక్తులు చేసే దానాలను బట్టి ఫలితాలను పొందుతారట. హిందూ మతంలో, పౌర్ణమి, అమావాస్య తిథిలలో దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా సోమవతి అమావాస్య రోజున చేసే దానధర్మాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. పూర్వీకులకు శ్రార్ధ కర్మలను నిర్వహించి, నైవేద్యాలు సమర్పించడం వలన పూర్వీకులు ప్రసన్నులవుతారు. సోమవతి అమావాస్యనాడు పుణ్యస్నానం చేసి కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేసిన వారికి కూడా పితృదోషం నుంచి విముక్తి లభిస్తుందట. సోమవతి అమావాస్య ఈ నెల 30న రానుందని ముందుగానే తెలుసుకున్నాం కదా.

సోమవతి అమావాస్యనాడు ఏమేం వస్తువులను దానం చేయాలి? ఏ ఏ వస్తువులను దానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం. సోమవతి అమావాస్య నాడు నల్ల నువ్వులను దానం చేస్తే చాలా మంచిదట. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి, అశుభ శక్తుల నుంచి రక్షించమంటూ నల్ల నువ్వులను దానం చేస్తారు. సోమవతి అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చేస్తే పితృ దోషం తొలగిపోయి జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. అలాగే సోమవతి అమావాస్యనాడు పూర్వీకుల పిండదానం చేసిన తర్వాత వారిని స్మరించుకుని వస్త్రదానం చేయాలి. అలా చేస్తే పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయట.

Share this post with your friends