గుడికి వెళ్లినప్పుడు మనం భగవంతుడిని ఏం ప్రార్థించాలి?

“అనాయాసేన మరణం
వినా దైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం.”

మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి. దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఏం కోరాలంటే.. “అనాయాసేన మరణం” అని కోరాలట. అంటే నొప్పి లేక బాధ లేని మరణాన్ని ప్రసాదించమని అర్థం. “వినా ధైన్యేన జీవనం” అంటే
ఎవరి మీదా ఆధారపడకుండా, జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించమని అర్థం.

“దేహాంతే తవ సాన్నిధ్యం” అంటే.. మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను.. నిన్ను దర్శించుకునే విధంగా దీవించు. అలాగే మూడు వరాలను ప్రసాదించాలని ప్రార్థించాలి. అవేంటంటే..

1. అనుక్షణం నీ ప్రార్ధనలోనే గడిపే విధముగా అనుగ్రహించు. నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.

2. ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ .. నా బిడ్డలకు కానీ .. సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను, కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.

3. నాకు ఎప్పుడూ కూడా నీవు అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు అని కోరాలి. గుడికి వెళ్లిన సమయంలో ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకుని ప్రవర్తిస్తే అవన్నీ ప్రసాదిస్తాడట.

Share this post with your friends