మనం ఇల్లు కట్టుకున్నా లేదంటే వ్యాపారం ప్రారంభించినా.. దిష్టి తగలకుండా బూడిద గుమ్మడికాయలను కడతాం. ఇల్లు, దుకాణాల ముందు బూడిద గుమ్మడికాయ ఉంటే నరదిష్టి తగలదట. ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయట. మరి నరదిష్టిని పోగొట్టే గుమ్మడి కాయ ఎలా ఉండాలో తెలుసుకుందాం. దిష్టి కోసమని తెచ్చే బూడిద గుమ్మడికాయ ఎలా పడితే అలా ఉండకూడదట. ఇంటి ముందు కట్టే గుమ్మడికాయను ఎట్టి పరిస్థితుల్లోనూ కడగకూడదట. కడిగితే దాని పవర్ పోతుందట.
బూడిద గుమ్మడికాయకు కడగకుండానే పసుపు, కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు కట్టుకోవాలట. అలాగే తొడిమ ఊడిపోయిన గుమ్మడికాయను ఇంటి ముందు కట్టకూడదట. ఇంటికి తీసుకొచ్చే సమయంలో తొడమతో లేపడమో.. లేదంటే తొడిమతో పట్టుకుని రావడమో చేస్తే అది ఊడిపోతుంది. అలాంటి గుమ్మడికాయ ఇంటి ముందు కట్టేందుకు పనికి రాదట. అలాగే గుమ్మడికాయను ఇంటికి తెచ్చే సమయంలో తిరగేసి కూడా పట్టుకోకూడదట. అలా చేస్తే నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి గుమ్మడికాయకు పోతుందట. కాబట్టి తొడిమ పైకి ఉండేలా గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకోవాలని పండితులు సూచిస్తున్నారు.