
చాతుర్మాస వ్రతం గురించి తెలుసుకున్నాం కదా. శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటాడు. ఈ క్రమంలోనే చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇక ఈ చాతుర్మాస వ్రతంలో భాగంగా.. శాక వ్రతమును ఆచరిస్తూ ఉంటారు. శాక వ్రతములో ఏమేం తీసుకోవాలి? వేటి వేటిని త్యజించాలో ముందుగా తెలుసుకుందాం. త్యజించాల్సిన వాటి లిస్ట్ అయితే చాలానే ఉంది. మరి అన్ని త్యజించాక ఏం తీసుకోవాలన్న ఏం తీసుకోవాలి? అంటే అది కూడా తెలుసుకుందాం. శాక వ్రతములో సకల కూరగాయలను త్యజించాల్సి ఉంటుంది.
దశవిధములైన శాకములను త్యజించాలి. శాకములనగా కేవలము కూరగాయలని అర్థము కాదు. చెట్టుకు సంబంధించిన, మూలము, పత్రము, కరీరము, మొలకలు, చెట్టు అగ్రభాగము, ఫలములు, కాండము, వేరు, పండు, దంటు, చెక్క, పూవు, తొక్క, మొగ్గుచిగురు, ఆకులు, ఆకుకూరలు, కరివేపాకు మొదలైన వాటిని శాకవ్రతములో భాగంగా త్యజించాల్సి ఉంటుంది. ఇక శాక వ్రతములో నాన్ వెజ్ తీసుకోకూడదు. త్యజించాల్సిన శాకముల లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. మరి శాక వ్రతములో స్వీకరించుటకు ఏమేం తీసుకోవచ్చంటే.. బేడలు, తులసీ, అతసీ, బ్రాహ్మీ, మిరియాలు, జీలకర్ర, ఎండుశుంఠి, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ఇంగువ, ఎండిన ఉసిరికాయను ఉపయోగిస్తారు.
