ఈ నెల 29న ఫాల్గుణ అమావాస్య రానుంది. ఈ నేపథ్యంలో పితృదోష నివారణకు నదీస్నానమాచరించి పిండ ప్రదానం చేయాలని తెలుసుకున్నాం కదా. ఇంకా ఏం చేయాలో తెలుసుకుందాం. రావి చెట్టుకు నీరు, పాలు సమర్పించి బియ్యం, పండ్లు, పువ్వులు, నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టిన అనంతరం నెయ్యి దీపం వెలిగించాలి. అనంతరం రావిచెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి గోమాతకు ఆహారాన్ని అందించాలి. ఇలా 11 రోజులు క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన పితృ దోషం నుంచి ఉపశమనం లభించడమే కాకుండా పూర్వీకుల ఆశీర్వాదంతో, కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు నిలిచి ఉంటాయి.
పాల్గుణ అమావాస్య రోజున ఒక శుభ్రమైన పాత్ర తీసుకొని అందులో నీరు, నల్ల నువ్వులు, దర్భలను కలిపి పూర్వీకులను ధ్యానించండి. దీని తరువాత పూర్వీకుల పేరిట దానం చేస్తే వారి ఆత్మలకు శాంతిని లభించి పితృ దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులు అందరి నుంచి ఒక రూపాయి నాణెం సేకరించి ఆ డబ్బులను ఏదైనా ఆలయానికి ఫాల్గుణ అమావాస్య రోజున విరాళంగా ఇస్తే పూర్వీకులు సంతోషిస్తారట. పాల్గుణ అమావాస్య రోజున ఆవు పేడతో చేసిన పిడకల మీద కాల్చి.. దానిపై పాలతో చేసిన పాయసాన్ని తయారు చేయాలి. ఆ పాయసాన్ని పూర్వీకులకు నైవేద్యంగా సమర్పించండి. పూజ చేసిన తర్వాత కాకికి, కుక్కకు ఆహారాన్ని అందిస్తే పితృదోష నివారణ జరుగుతుంది.