ఒకవేళ అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి?

అఖండ దీపం గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. అఖండ దీపం మనం ఉంచాలనుకున్నన్ని రోజులు కొండెక్కకుండా చూసుకోవాలని చెప్పుకున్నాం. అలాగే అఖండ దీపంలో వత్తిని సైతం ప్రతిరోజూ గమనించుకుంటూ ఉండాలి. మొత్తం అఖండ దీపం ప్రాధాన్యత అయితే అంతా ఇంతా కాదు. ఒకవేళ అఖండ దీపం 24 గంటల ముందే దీపం కొండెక్కితే ఏం చేయాలనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ అఖండ దీపం కొండెక్కిందా? ఏదో అశుభం జరగబోతోందని ఆందోళన చెందుతారు.

అనుకున్న సమయానికి అఖండ దీపం కొండెక్కితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేద కానీ ముందుగా కొండెక్కితేనే కాస్త భయపడుతూ ఉంటారు. అఖండ దీపం కొండెక్కితే.. మళ్లీ మూకుడులో నూనె లేదా నెయ్యి పోసి మరో వత్తిని వేసి దీపం పెట్టి ఆ సమయం నుంచి 24 గంటల వరకు వత్తి నిరంతరం వెలిగేలా చూసుకుంటే ఇబ్బంది ఉండదట. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని పండితులు చెబుతున్నారు.

Share this post with your friends