బుధ ప్రదోష వ్రతం రోజున వేటిని దానం చేయాలి?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో బుధ దోషం ఉంటే వారు బుధ ప్రదోష వ్రతాన్ని చేయాలి. ఇలా చేస్తే శివ పార్వతుల ఆశీర్వాదంతో పాటు విఘ్నేశ్వరుడి ప్రత్యేక ఆశీర్వాదం కూడా లభిస్తుందట. ఇక ఈ రోజున వేటిని దానం చేయాలో చూద్దాం. ముఖ్యంగా నల్ల నువ్వులు చాలా ప్రతీకరమైనవి కాబట్టి వీటిని దానం చేస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయట. అలాగే పెరుగును దానం చేస్తే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. దేవతల ఆహారంగా పరిగణించే నెయ్యిని దానం చేయడం వలన బుద్ధికి పదును, జ్ఞానం పెరుగుతుందట. అలాగే కొబ్బరికాయను దానం చేస్తే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటాయట. వస్త్రదానం, అన్నదానం వలన పుణ్యం లభిస్తుందట.

ఇక ఈ రోజున శివుడిని ఆరాధిస్తే మనకు స్వామివారి ఆదాయం లభించి సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందట. ఇక ప్రదోష వ్రతం చేస్తే కోరికలన్నీ నెరవేరుతాయట. అలాగే ఈ వ్రతాన్ని ఆచరించడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయట. గ్రహాల వల్ల జరిగే అశుభాల నుంచి శివుడు మనల్ని బయటపడేస్తాడట. మన ఇంట సంతోషం, శ్రేయస్సు కోసం ఈ వ్రతం ఉత్తమమైన మార్గమని అంటారు. అలాగే ఈరోజున గణపతిని కూడా పూజిస్తాం కాబట్టి అన్ని విఘ్నాలూ తొలగిపోయి వ్యాపారం, ఉద్యోగంలో వృద్ధి ఉంటుందట.

Share this post with your friends