దూతకు ఎలాంటి గుణాలుండాలి?

హనుమంతుడిని శ్రీరామచంద్రుల వారు దూతగా పంపారని రామాయణంలో మనం తెలుసుకుంటాం. అసలు హనుమనే శ్రీరాముడు దూతగా ఎందుకు ఎంచుకున్నాడు? దూతకు ఉండాల్సిన గుణాలేంటి? అనే విషయాల గురించి విదురనీతిలోని ఓ శ్లోకం చెబుతోంది.

శ్లో𝕝𝕝 అస్తబ్దమక్లీబమదీర్ఘసూత్రం
సానుక్రోశం శ్లక్ష్ణమహార్యమన్యైః
అరోగజాతీయముదారవాక్యం
దూతం వద న్యష్టగుణోపపన్నమ్!!

దూతకు ఎలాంటి గుణాలుండాలి?
దూతకు ఎలాంటి గుణాలుండాలి?

పై శ్లోకం అర్థం ఏంటంటే.. దూతకు ఎనిమిది గుణిలు ఉండాలట. అవేంటంటే.. అహంకారము లేకుండుట, సామర్ధ్యము కలిగియుండుట, శీఘ్రముగా పనులు ముగించుట, దయగలిగి యుండుట, శుద్ధ హృదయుని, ఇతరుల మోసములకు లొంగ కుండుట, ఆరోగ్యము కలిగి యుండుట, ఉదార వాక్యములు పలుకుట. ఈ ఎనిమిది గుణములు ఉన్నవాడిని ‘దూత’ అని పెద్దలు చెబుతున్నారు. ఈ లక్షణాలన్నీ హనుమంతుడిలో ఉన్న కారణంగానే ఆయనను శ్రీరామచంద్రుడు దూతగా పంపించాడట.

Share this post with your friends