యోగా అంటే ఏమిటి? దీనికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడ ఉంది?

దేశం మొత్తం ఈ రోజు (జూన్ 21న) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీనిని మనం 2015 నుంచి జరుపుకుంటున్నాం. అసలు యోగా అంటే అర్థం ఏమిటి? తొలి యోగా గురువు ఎవరు? ఏ ఏ గ్రంథాలలో దీని ప్రస్తావన ఉందో ముందుగా తెలుసుకుందాం. యోగా అంటే చేరడం.. అంటే ఆధ్యాత్మికంగా శరీరం , మనస్సుల కలయిక లేదంటే ఏకీకృతం కావడం. శరీరంతో పాటు మనస్సును సైతం ఆరోగ్యంగా మార్చగల శక్తి యోగాకు ఉంది. యోగా జన్మస్థలం వచ్చేసి మన భారతదేశం కావడమే విశేషం. మన దేశంలో పుట్టిన యోగాకి అంతర్జాతీయ ఖ్యాతి లభించడం మరో విశేషం.

యోగా ఆది యుగాల నాటిదని చెబుతారు. వేదాలు, పురాణాలలోనూ యోగాకు సంబంధించిన ఆనవాల్లు కనిపిస్తాయి. సింధు లోయ నాగరికతతో పాటు బుుగ్వేదంలో కూడా యోగా ప్రస్తావన ఉంది. ఇది ఐదు వేల ఏళ్ల నాటిదని చరిత్యర చెబుతోంది. దాని రుజువు వేదాలు, పురాణాలలో మాత్రమే కాకుండా.. ఉపనిషత్తులు, మహాభారతం, భగవద్గీతలలో యోగా ప్రస్తావన కనిపిస్తుంది. ముఖ్యంగా జ్ఞాన యోగం, భక్తి యోగం, కర్మ యోగం, రాజ యోగం భగవద్గీతలో ప్రస్తావించబడ్డాయి. యోగా ప్రాథమిక రూపం చాలా సూక్ష్మమైన శాస్త్రం. యోగాకి నిజమైన అర్ధం ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ, ఆత్మ సాక్షాత్కారం.

Share this post with your friends