తిరుప్పావై అంటే ఏమిటి? గోదాదేవి ఎవరు?

ధనుర్మాసంలో వైష్ణవ ఆలయాల్లో ప్రతి రోజూ తెల్లవారుజామున తిరుప్పావై నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా ధనుర్మాసం 30 రోజులు సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే మనం తిరుప్పావైని బాగా వింటున్నాం. అసలు ఈ తిరుప్పావై అంటే ఏమిటి? గోదాదేవి ఎవరు? 30 పాశురాల గురించి కూడా వింటున్నాం. దాని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. ముందుగా తిరుప్పావై అంటే ఏంటంటే.. గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ అమ్మవారు భగవంతుడినే భర్తగా భావించిందట. ఈ క్రమంలోనే ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై.

‘తిరు’ అంటే శ్రీ అని, ‘పావై’ అంటే పాటలు లేదా వ్రతం అని అర్ధం. మొత్తంగా తిరుప్పావై అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం. తిరుప్పావైలో 30 పాశురాలు ఉంటాయి. చందోబద్దమైన పాటలనే పాశురం అని పిలుస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ఆముక్తమాల్యద అనే గ్రంథంలో ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్ని వివరించారు. గోదాదేవి రచించిన 30 పాశురాలు ఏం సూచిస్తాయంటే.. మంచి అలవాట్లతో జీవించాలి. అలాగే తోటివారికి సాయపడటంతో పాటు భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని సూచిస్తాయి. ఈ క్రమంలోనే ఒక్కో పాశురాన్ని ఒక్కొక్క రోజు చొప్పున 30 రోజుల పాటు గానం చేస్తారు.

Share this post with your friends