అట్లతద్ది రోజున చదవాల్సిన కథ ఏంటంటే..

అట్లతద్ది పండుగను మనం ఈ నెల 19న జరుపుకోనున్నాం. ఆ రోజున నోచుకునే నోము సందర్భంగా ఓ కథ చదవుతారు. ఆ కథేంటో తెలుసుకుందాం. పూర్వం సునామ అనే రాజకుమారి ఉండేది. రాజకుమారిని వాళ్ల అన్నలు ఎంతో ప్రేమగా, గారాభంగా చూసుకునేవారు. మంచి భర్త కోసం ఆమె స్నేహితులు అట్లతద్ది నోము చేస్తున్నారని తెలుసుకుని ఆమె కూడా చేసింది. అయితే చంద్రుడిని చూడకుండా ఏమీ తినకూడదనే కారణంతో ఏమీ తినదు. దీంతో నీరసించి సొమ్మసిల్లి పడిపోయింది. చెల్లిని చూసిన అన్నలు ఆవేదనతో బాగా ఆలోచించి చెట్టుకి అద్దం కట్టి దాని వెనుక నుంచి కొంచెం దూరంలో మంట పెడతారు.

అప్పుడు ఆ మంట ప్రతిబింబం అద్దంలో చంద్రుడి మాదిరిగా కనిపించడంతో రాజకుమారి చంద్రదోయం అయ్యిందని భావించి గౌరీ వ్రతం చేసుకొని, ముత్తైదులకి వాయనం ఇచ్చేసి ఫలహారం తీసుకుంటుంది. తర్వాత ఆమెకు పెళ్లి వయసు వచ్చే సరికి అందరూ ముసలి వాళ్ళ సంబంధాలే వచ్చేవి. దీంతో ఆ రాజకుమారి ముసలివాడిని పెళ్లి చేసుకోవడం కంటే చావడం మేలనుకుని అడవిలోకి పారిపోతుండగా ఆమె ఎదుట పార్వతీపరమేశ్వరులు సునామ ఎదుట ప్రత్యక్షమవుతారు. ఎక్కడికి వెళుతున్నావని అడగ్గా జరిగిన విషయం పార్వతీ పరమేశ్వరులకు చెబుతుంది. అట్లతద్ది నోములో జరిగిన తప్పిదం కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని కాబట్టి మరోసారి నిష్ఠగా అట్లతద్ది నోముని చేయమని చెబుతారు. పార్వతి దేవి చెప్పినట్టుగానే అట్లతద్ది వ్రతం చేయడంతో ఆమెకు తగిన వరుడుతో పెళ్లి జరుగుతుంది. అప్పటి నుంచి అట్లతద్దె నోముని ఎటువంటి వ్రత భంగం లేకుండా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఇదీ కథ.

Share this post with your friends