
ఉత్తరప్రదేశ్లోని కర్మనాశ నది గురించి తెలుసుకున్నాం కదా. మనం ఏ పనిమీదైనా వెళుతూ ఆ నది నీటిని తాకితే ఆ పని సర్వనాశనమవుతుందని కూడా తెలుసుకున్నాం. అసలు సర్వనాశ నది కథేంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం హరిశ్చంద్ర రాజు తండ్రి సత్యవ్రత చాలా ధైర్యవంతుడు. అతని గురువు వశిష్ఠుడు. ఒకరోజు వశిష్టుడిని ఏదైనా వరం కోరుకోమని సత్యవ్రతుడు చెప్పాడట. భౌతికంగా స్వర్గానికి వెళ్లాలనే కోరికను గురువు వశిష్ఠునికి తెలియజేశాడు. ఆ కోరికను తీర్చేందుకు వశిష్ఠుడు నిరాకరించాడు. కానీ సత్యవ్రతుడు తన కోరిక తీర్చాలని ఎలాగైనా బొందితో స్వర్గానికి వెళ్లాలని కోరాడు. స్వర్గానికి వెళ్ళాలనే కోరిక తీర్చని వశిష్టుడి మీద సత్యవ్రతుడు కోపం తెచ్చుకున్నాడట.
తనను ఎలాగైనా సరే స్వర్గానికి వెళ్ళాలనే కోరికతో విశ్వామిత్రుని వద్దకు ఆయనకు తన కోరికను వశిసష్టుడు కాదన్నాడని కాబట్టి తన కోరికను నెరవేర్చాలని విశ్వామిత్రుడిని కోరాడట. దీనికి అంగీకరించిన విశ్వామిత్రుడు తన తప:శక్తితో సత్యవ్రతుడిని స్వర్గానికి పంపించాలని నిర్ణయించుకున్నాడు. మొత్తానికి సత్యవ్రతుడిని విశ్వామిత్రుడు స్వర్గానికి పంపించాడు. అక్కడ సత్యవ్రతుడిని చూసిన ఇంద్రుడు కోపంతో భూమి మీదకు తోసేశాడట. వశిష్ఠుడు అంటే అసూయ, అకారణ శత్రుత్వం కారణంగా.. వశిష్టుడు కాదన్న రాజు సత్యవ్రత్రుడి కోరికను తీర్చడానికి విశ్వామిత్రుడు అంగీకరించాడు. తలక్రిందులుగా భూలోకానికి వస్తున్న రాజుని విశ్వామిత్రుడు తన తపస్సుతో స్వర్గానికి, భూమికి మధ్య అడ్డుకుని త్రిశంక స్వర్గంలో ఉంచాడట. అప్పుడు దేవతలకు, విశ్వామిత్రునికి మధ్య యుద్ధం జరిగిందట. సత్యవ్రతుడు భూమి..ఆకాశంలో తలక్రిందులుగా వేలాడుతున్న సమయంలో అతని నోటి నుంచి లాలాజలం వేగంగా కారడం ప్రారంభించింది. ఈ లాలాజలం నది రూపంలో భూమిపై ప్రవహించింది. వశిష్ఠ మహర్షి రాజును శపించాడని .. కాబట్టి అతని లాలాజలం నుంచి ఏర్పడిన నది కర్మనాశ నదిగా ఏర్పడిందని చెబుతారు.
