పురాణాల ప్రకారం ఇంద్రసేనుడు అనే రాజు ఉండేవాడు. ఆయన గొప్ప విష్ణు భక్తుడే కాకుండా దయ, శక్తివంతమైన రాజు కావడంతో పాటు ప్రజల పట్ల చాలా శ్రద్ధ వహించేవాడు. ఒకసారి నారద మహర్షి ఇంద్రసేనుడి రాజ్యాన్ని సందర్శించాడు. తన తండ్రి మరణంతో చాలా కుంగిపోయానని నారదుడికి ఇంద్రసేన వెల్లడించాడు. అప్పుడు నారదుడు.. యమలోకంలో ఉన్నాడని.. అతను తాను చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తూ బాధపడుతున్నాడని చెప్పాడు. తన తండ్రిని పాపవిముక్తిడిని చేయడం కోసం ఇంద్రసేనుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి బ్రాహ్మణులకు దానధర్మాలు చేశాడు.
ఉపవాసం , ఆచారాలను ఎలా పాటించాలో నారద మహర్షి రాజుకు తన సహకారం అందించాడు. నారదుని సహకారంతో ఇంద్రసేనుడు ఏకాదశి వ్రతం ఆచరించి.. మరుసటి రోజు తన ఉపవాస దీక్షను ముగించాడు. ఇక తన తండ్రిని అన్ని పాపాల నుంచి విముక్తి చేసి మోక్షాన్ని అందిచమని నారద మహర్షి సందేశాన్ని అందించాడు. వ్రతం ముగిసిన అనంతరం ఇంద్రసేనుడు తన తండ్రి విష్ణు నివాసం వైపు చిరునవ్వులు చిందిస్తూ వెళ్లడాన్ని చూశాడు. వ్రత ఫలితంగా రాజు తండ్రి మోక్షాన్ని పొందాడు. అలాగే ఇంద్రసేనుడు తన పాలనా కాలాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాడు. కాబట్టి ఇందిరా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది.