సరస్వతీ దేవి పక్కన నెమలి, హంస ఉండటానికి కారణమేంటి?

సరస్వతీదేవి చిత్రపటాన్ని ఎప్పుడైనా పరీక్షగా చూశారా? తెల్లని చీరను ధరించి శ్వేతపద్మంలో కూర్చొని వీణ వాయిస్తూ అమ్మవారు మనకు కనిపిస్తుంది. మన కళ్లు దాదాపుగా అమ్మవారిని దాటి పోలేవు. అయితే ఆమె పక్కన నెమలి, హంస కూడా ఉంటాయి. సరస్వతీదేవికి హంస వాహనమైతే.. నెమలి ఆమెకు చాలా ఇష్టమైన పక్షి అట. ఇక అమ్మవారి గురించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. అమ్మవారు కమల పుష్పంలో కూర్చొని కనిపిస్తూ ఉంటుంది. అమ్మను విద్యాదేవతగా కొలుస్తూ ఉంటాం. బురద నుంచి కమలం పుడుతుంది. అయితే కమలానికి మాత్రం బురద అంటిన ఛాయలే కనిపించవు. సూర్యుని వెలుగు తాకగానే వికసిస్తుంది. అందుకే దీనిని జ్ఞానపుష్పంగా పరిగణిస్తారు.

ఇక సరస్వతిదేవి హంసను వాహనంగా ఎంచుకోవడానికి ఓ కారణముంది. హంస పాలను, నీటిని వేరు చేయగల ఏకైక జీవి. అందుకే దీనిని జ్ఞాన పక్షిగా పరిగణిస్తూ ఉంటారు. విద్య వల్ల వివేకం, విజ్ఞానం లభిస్తాయని తెలియపర్చటానికే సరస్వతీదేవి హంసను వాహనంగా ఎంచుకుందని చెబుతారు. ఇక అమ్మవారి వద్ద నెమలి ఉండటానికి కూడా ఓ కారణం చెబుతారు. ప్రాణకోటి సమస్తం ఆడ, మగ కలిసి సంభోగం చేస్తాయి. కానీ సంభోగం చేయని ఏకైక జీవి నెమలి. కాబట్టి అమ్మవారు నెమలిని పక్కన పెట్టుకుంటారని అంటారు. అంటే విద్య పవిత్రమైనదని చెప్పేందుకే నెమలిని సరస్వతీదేవి పక్కన చిత్రిస్తుంటారని చెబుతారు.

Share this post with your friends