ఉగాది పచ్చడి పరమార్థం ఏమిటి?

ఉగాది పండుగ చేసుకోవడం వెనుక పురాణ కథ ఒకటి ఉంది. వేదాలను అపహరించుకొని పోయిన సోమకుని శ్రీ మహా విష్ణువు సంహరించారు. అనంతరం ఆ వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉగాది పండుగను జరుపుకుంటామని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ విశ్వాన్ని బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సృష్టించాడు. అందుకే మనం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. దీనిని ప్రకృతి పండుగ అని కూడా అంటారు. ఆకులు రాలిపోయి మోడుగా మారిన చెట్లన్నీ వంసంతం రాగానే కొత్త చిగుళ్లు తొడుగుతాయి కాబట్టి ఇది ప్రకృతి పండుగ అని కూడా పేర్కొంటాం.

ఉగాది పచ్చడిని ప్రతి ఒక్క తెలుగు ఇంట తయారు చేస్తారు. అసలు ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి అంతరార్థం ఏంటో తెలుసుకుందాం. తీపి, కారం, చేదు, పూరువు, నగరు, ఉప్పు వంటి అసమే ఈ ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఇందులో ఏ రుచి కోసం దేనిని వాడుతామో అందరికీ తెలిసిందే. అసలు ఈ పచ్చడి అంతరార్థమేంటనేది చాలా మందికి తెలియదు. సంవత్సరమంతా జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాల సమాహారంగా స్వీకరించడమే ఉగాది పచ్చడి పరమార్థం. ఆరోగ్యపరంగా చూస్తే వసంత రుతువు ఆరంభంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు విరుగుడుగా వేపపువ్వుతో చేసిన ఉగాది పచ్చడి ఉపయోగపడుతుంది.

Share this post with your friends