ద్వారకాధీశ ఆలయ విశేషాల గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. ఇప్పుడు ఆలయ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. శ్రీ కృష్ణుడు నిర్మించిన ద్వారక నగరంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. దీనిని శ్రీ కృష్ణుని మనుమడైన వజ్రనాభుడు (అనిరథుడి సంతానం) ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయాన్ని హరిగృహం (శ్రీకృష్ణుడు నివసించిన ప్రదేశం)గా పేర్కొంటారు. ఒక గొడుగు ఆకారంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అనంతరం ఆదిశంకరాచార్యులు ద్వారకాధీష్ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆ తరువాతి కాలంలోనూ వివిధ పాలకుల హయాంలో ఆయా కాలానుగుణంగా చాలా మార్పులు జరిగాయి.
ఈ ఆలయం వైష్ణవ భక్తులకు చాలా ముఖ్యమైన ప్రదేశం. శ్రీకృష్ణ జన్మాష్టమికి ఇక్కడ సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈ ద్వారకాదీశ ఆలయంలో ఆసక్తికరంగా శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత మరో కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రీ కృష్ణుడి జన్మాష్టమి తర్వాత ధనకానాను పంపిణీ చేసే ప్రత్యేక సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం జన్మాష్టమికి ఒక రోజు ముందు నిర్వహించడం ఆనవాయితీ. శ్రీకృష్ణుని జన్మని గుర్తు చేసుకుంటూ నిర్వహించే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం భారతీయ కళ, సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తోంది.