మాస శివరాత్రిని శాస్త్రీయంగా జరుపుకుంటే ఏం జరుగుతుందంటే..

మాస శివరాత్రి నాడు ముఖ్యంగా ప్రదోషవేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది. ఇవేమీ చేయడానికి అవకాశములేని వారు ఆరోగ్యవంతులు అలాగే గృహములో అశౌచ దోషము లేనివారు ఈ రోజు ఉపవాసము ఉండి మూడు పూటల చల్లని నీటితో స్నానం చేయాలి. మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి. మాస శివరాత్రిని జరుపుకోవడము వలన ఉపయోగములు? ప్రత్యేకించి ఈ రోజును శాస్త్రీయంగా జరుపుకోవడము వలన మన జాతకములోని క్షీణ చంద్ర దోషముల తీవ్రత తగ్గు ముఖం పడుతుంది.

మాస శివరాత్రిని శాస్త్రీయంగా జరుపుకుంటే ఏం జరుగుతుందంటే..
మాస శివరాత్రిని శాస్త్రీయంగా జరుపుకుంటే ఏం జరుగుతుందంటే..

సంతానలేమి సమస్యలు నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తికి సంబంధించిన అవరోధాలలో మార్పు కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్దకంగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి దేవాలముకు వెళ్ళే అలవాటును చేయించగలిగితే వారిలో కాలక్రమములో ఖశ్చితముగా మార్పు వస్తుందని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు.. మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కాబట్టి ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడము ద్వారా శుభములను పొందగలుగుతాము.

Share this post with your friends