మాస శివరాత్రిని ఎందుకు జరుపుకోవాలి?

మహాశివుడు లయ కారకుడు. లయం అంటే మృత్యువు అని అర్థం. మృత్యువునకు కారకుడు కేతువు. అమావాస్యకు ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. చంద్రోమా మనస్సో జాతః అనే సిద్దాంతము ప్రకారం ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూయించడము వలన జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది.

మాస శివరాత్రిని ఎందుకు జరుపుకోవాలి?
మాస శివరాత్రిని ఎందుకు జరుపుకోవాలి?

ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. మనం గమనిస్తే అమావాస్య తిథి ముందు ఘడియాలలో కొందరి ఆరోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణము ఇదే అని చెప్పవచ్చు. కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంతమేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది.

Share this post with your friends