పాండవతీర్థం పురాణ ప్రాశస్త్యం ఏంటి? ఎప్పుడు స్నానమాచరించాలి?

పాండవ తీర్థం గురించి తెలుసుకున్నాం. అలాగే పాండవతీర్థం స్థల పురాణం ఏంటనేది కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు పాండవతీర్థం పురాణ ప్రాశస్త్యం, పాండవ తీర్థంలో ఎప్పుడు స్నానమాచరించాలనేది తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ దూరంలో ఈ పాండవ తీర్థం ఉంటుంది. దీనిలో పాండవులు ఏడాది కాలం పాటు స్నానమాచరించడంతో వారికి యుద్ధంలో విజయం లభించి.. రాజ్య ప్రాప్తి కలిగిందని వరాహ పురాణం చెబుతోంది. అనంతరం కౌరవులను చంపడం వల్ల కలిగిన పాపాన్ని సైతం పాండవులు ఈ తీర్థంలో స్నానమాచరించే పొగొట్టుకున్నారని పద్మపురాణం ద్వారా తెలుస్తోంది.

పాండవ తీర్థంలో ఎప్పుడు స్నానం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. పాండవ తీర్థంలో ఏడాది మొత్తం భక్తులు స్నానాలు చేస్తూనే ఉంటారు. కానీ వైశాఖమాసంలో శుక్లపక్ష ద్వాదశి, ఆదివారం కలిసి వచ్చిన రోజున కానీ కృష్ణ పక్ష ద్వాదశి మంగళవారం కలిసి వచ్చిన రోజు స్నానం చేయటం వలన ఫలితం అద్భుతంగా ఉంటుంది. తిరుమల యాత్రకు వెళ్లే వారు పాండవ తీర్థం కూడా దర్శించి. ఈ తీర్థంలో స్నానం చేస్తే వృత్తి ఉద్యోగాలు, చేపట్టిన పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవని, అన్నింటా విజయాలు చేకూరుతాయని విశ్వాసం.

Share this post with your friends