ఇక్కడి ప్రసాదం స్వీకరిస్తే జీవితంలో అన్నపానీయాలకు లోటుండదట..

కర్ణాటకలోని హొరనాడులో, చిక్కమంగళూరు నుంచి 100 కిమీ దూరంలో ఉన్న అన్నపూర్ణేశ్వరి దేవాలయం గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దీని స్థల పురాణం గురించి తెలుసుకుందాం. భారత దేశం నలుచెరగులా పాద యాత్ర చేసి ఎన్నో పీటాలను స్థాపించిన ఆది శంకరులు ఒకసారి మార్గ మధ్యంలో ఒక చోట ఆగారు. శంకరులకు వారి శిష్య బృందానికి ఆకలిగా ఉంది. అది దట్టమైన అడవి ప్రాంతం. ఎక్కడా ఆతిథ్యమిచ్చే గృహాలు లేవు. అప్పుడు శంకరులు అన్నపూర్ణా దేవిని స్తోత్రం చేయగా ఒక పండు ముత్తదువ రూపంలో వారిని సమీపించి ఆకలితో ఉన్నట్లు ఉన్నారు.

మీరంతా మా గృహానికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించవలసినది అని కోరింది. శంకరులు వారి శిష్యులు ఆ ముత్తైదువ గృహానికి వెళ్ళగా అక్కడ పంచ భక్ష పరమాన్నాలతో షడ్రసోపేతమైన అన్నము పెట్టింది. శంకరులు ఆవిడ శ్రీ అన్నపూర్ణా దేవి అని గుర్తించి మరల స్తోత్రం చేసి అమ్మవారిని అక్కడే కొలువై ఉండమని ప్రార్ధించారు. అప్పుడు అన్నపూర్ణ దేవి బంగారు ప్రతిమయై అక్కడ శాశ్వతంగా నిలిచిపోయారు. అదే నేడు హొరనాడు శ్రీ అన్నపూర్ణా ఆలయంగా భాసిల్లుతోంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించిన వారికి ఈ జన్మలో అన్నపానీయాలకు లోటు ఉండదు అని ప్రతీతి.

Share this post with your friends