వసంత పంచమి ప్రాముఖ్యత ఏంటంటే..

వసంత పంచమి రోజున మహా కుంభమేళాలో నాలుగవ రాజస్నానం నిర్వహిస్తారు. వసంత పంచమి ఫిబ్రవరి 3న రానుందని తెలుసుకున్నాం కదా. నాలుగవ రాజస్నానం రోజున బ్రహ్మ ముహూర్తం సాయంత్రం 5.23 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.16 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో స్నానమాచరిస్తే చాలా మంచిది. అసలు వసంత పంచమి ప్రాముఖ్యత ఏంటంటే.. బ్రహ్మ దేవుడి ప్రార్థన వల్ల సరస్వతి దేవి ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. సరస్వతి దేవి వాక్కు, సంగీతం,జ్ఞానానికి అధిష్టాన దేవత అని నమ్ముతారు. అలాగే వసంత పంచమి నుంచి వసంతకాలం ప్రారంభమవుతుంది.

మహాకుంభమేళాలో రాజస్నానం చేసేవారు ముందుగా నది ఒడ్డున ఉన్న మట్టిని సేకరించి నదికి నమస్కరించిన అనంతరం నీటిలోకి వెళ్లాలి. తీసుకెళ్లిన మట్టిని నదిలో కలిపి ముక్కు మూసుకుని నీటిలో మూడు సార్లు మునిగిన అనంతరం దోసిలిలో నీటిని తీసుకుని సూర్య భగవానుడికి అర్ఘ్యమివ్వాలి. ఆ తరువాత నది బయటకు వచ్చి పసుపు కుంకుమ, పువ్వులను నదికి సమర్పించి అరటి దొన్నెలో దీపం వెలిగించి నీటిలో వదిలి నమస్కరించుకోవాలి. అనంతరం పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వంశాభివృద్ది కలుగుతుందట. నాలుగో రాజస్నానం అనంతరం చేసే దానాలకు సైతం అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.

Share this post with your friends