పుత్రద ఏకాదశి ప్రాధాన్యత ఏంటి? పూజా విధానం ఏంటి?

పుత్రద ఏకాదశిని ఎప్పుడు జరుపుకోవాలో తెలుసుకున్నాం కదా. ఈ నెల 5న పుత్రద ఏకాదశిని జరుపుకోనున్నాం. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించుకుంటారు. అసలు పుత్రద ఏకాదశి ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం. చాలా మంది పుత్ర సంతానం కోసం తపిస్తూ ఉంటారు. వారంతా పుత్ర ఏకాదశి నాడు ఉపవాసముండి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే పుత్ర సంతానం కలుగుతుందట. అసలు సంతానమే లేని వారు సైతం ఉపవాసం ఆచరించినా సంతాన భాగ్యం కలుగుతుందట. అలాగే శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం ద్వారా మోక్షం లభిస్తుందని నమ్మకం.

పుత్రదా ఏకాదశి 2025 పూజ విధానం గురించి కూడా తెలుసుకుందాం. ఈ నెల 5న పుత్రద ఏకాదశి కాబట్టి ఆ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి శుచిగా స్నానమాచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి. అనంతరం ఇంట్లోని పూజ స్థలాన్ని శుభ్రం చేసుకోాలి. అనంతరం ఏదైనా పీటపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి విష్ణుమూర్తి చిత్రపటం లేదంటే విగ్రహాన్ని ప్రతిష్టించడం. ఆ తరువాత గంగాజలం, పంచామృతంతో చిత్ర పటాన్ని అభిషేకించి పసుపు, గంధం, పువ్వులు, తులసి దళాలను సమర్పించాలి. ఆ తరువాత విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించాలి. నైవేద్యంగా స్వీట్స్, ఏవైనా పండ్లను సమర్పించాలి. చివరిగా విష్ణు చాలీసా పఠించి హారతి ఇస్తే పూజ ముగిసినట్టే.

Share this post with your friends