జ్యేష్ట గౌరీ పూజ ప్రాముఖ్యతేంటి? ఎవరు చేసుకోవాలి?

మన సంస్కృతిలో గౌరీ పూజకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. వివాహం కావాల్సిన కన్నెలు మంచి భర్త కోసం గౌరీ పూజ చేస్తారు. అలాగే పెళ్లి పీటలు ఎక్కే ముందు నూతన వధువు చేత కూడా గౌరీ పూజ చేయించడం మన సంప్రదాయం. శ్రీరాముని భర్తగా పొందేందుకు సీతాదేవి కూడా గౌరీదేవిని పూజించిందని చెబుతారు. ఈ సందర్భంగా భాద్రపద మాసంలో విశేషంగా జరుపుకునే జ్యేష్ఠ గౌరీ పూజ చాల విశిష్టత కలిగినదని మన పురాణాలు చెబుతున్నాయి.

జ్యేష్ఠ గౌరీ పూజ ఎప్పుడు చేసుకోవాలి?

వ్యాస భగవానుడు రచించిన భవిష్య పురాణం ప్రకారం భాద్రపద మాసంలో జ్యేష్టా నక్షత్రం ఉన్న రోజున జ్యేష్ఠ గౌరీ పూజను చేసుకోవాలి. సోమవారం నాడు జ్యేష్టా నక్షత్రం ఉన్నందున ఈ రోజునే ఈ పూజను ఆచరించాలి.

జ్యేష్ఠ గౌరీ పూజ ఎవరు చేసుకోవాలి?

వివాహం కాని అమ్మాయిలు మంచి భర్త కోసం.. వివాహితులు దీర్ఘ సుమంగళి తనం కోసం ఈ పూజ చేసుకోవాల్సి ఉంటుంది.

జ్యేష్ఠ గౌరీ పూజ విశిష్టత

శివపార్వతుల అనుగ్రహం కోసం చేసే ఈ పూజను సాధారణంగా గుడుల్లో చేస్తారు. కొంతమంది ఇంట్లో కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా మహారాష్ట్రంలో మరాఠీ కుటుంబాలు ఈ పూజను విశేషంగా చేస్తారు.

Share this post with your friends