తేనిలోకి కొడంగిపట్టిలో చిత్రగుప్తుడి ఆలయ చరిత్ర ఏంటి?

చిత్రగుప్తుడు అసలు ఎలా పుట్టాడనే కథ తెలుసుకున్నాం కదా. మరి తమిళనాడులోని తేని నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మధురై-కొచ్చి జాతీయ రహదారిపై బోడినాయకనూర్ వెళ్ళే మార్గంలో కొడంగిపట్టిలో ఉన్న చిత్రగుప్తుడి ఆలయానికి ఎలా వచ్చాడు? అది కూడా తెలుసుకుందాం. కోడంగి పట్టి ప్రాంతంలో నివసించే ఒక వ్యక్తికి చిత్రగుప్తుడు ఒకరోజు కలలో కనిపించి ఈ పట్టణంలో తనకొక ఆలయాన్ని నిర్మించి తనను పూజించమని చెప్పాడట. వెంటనే పట్టణంలోని వారితో అతను మాట్లాడి చిత్రగుప్తుడికి ఆలయాన్ని నిర్మించాడట.

చిత్రగుప్తుడు పౌర్ణమి రోజున జన్మించాడట. కాబట్టి ఆ రోజున నూనెతో స్నానం చేస్తే మన సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఆ తరువాత చిత్ర గుప్తుడికి, ఆయన భార్య ప్రభావతికి పూజలు చేయాలి. అలాగే చిత్ర గుప్తుడు ఆవు గర్భం నుంచి జన్మించాడని కూడా చెబుతారు కాబట్టి ఈ రోజు ఇంట్లో ఆవు పాలు, పెరుగు లేదా ఆకుకూరలు వంటివేవీ వాడకూడదు. పౌర్ణమి నాడు పూజ తర్వాత చిత్రగుప్తుని శ్లోకాన్ని చదివితే దీర్ఘాయుష్షును అనుగ్రహిస్తాడట. ఇక ఈ ఆలయంలో పూజ చేస్తే చిత్రగుప్తుడు కేతువుకు అధిపతి కాబట్టి కేతు దోషం తొలగిపోతుందట.

Share this post with your friends